![]() |
![]() |
.webp)
జీ తెలుగులో ప్రసారమవుతున్న జయం సీరియల్. ఈ సీరియల్ తాజా ఎపిసోడ్ లలో ఏం జరిగిందో ఓ సారి చూసేద్దాం.. ఆషాడంలో గోరింటాకు పెట్టుకోవాలని సుధా, పెద్దసారు అనుకుంటారు. గోరింటాకు కోసం రంగా, గంగ దొంగతనానికి వెళ్తే అక్కడికి రుద్ర కూడా వెళ్లి గంగపై కోప్పడతాడు. మరోవైపు జయ, వీరు, ఇషిక పెళ్లి జరిపించాలని సీక్రెట్ గా ప్లాన్ వేసుకుంటారు. అదే సమయంలో రామనాథం అక్కడికి రావడం చూసి ఇషిక టెన్షన్ పడుతుంది. వీరు వెంటనే పెద్ద ప్లాన్ వేసి కర్రతో రామనాథాన్ని కొట్టి కిందపడేస్తాడు. ఎవరూ చూడకుండా అతన్ని స్టోర్ రూమ్ లోకి లాగి తాళ్లతో బంధించి కిడ్నాప్ చేస్తాడు. ఆ తర్వాత ఏమీ తెలియనట్లు మళ్లీ ఇంట్లోకి వచ్చి కవర్ చేస్తాడు.
ఇంట్లో గోరింటాకు వేడుక మొదలవుతుంది. జయకి వంశీకి బదులు స్నేహ గోరింటాకు పెట్టేలా గంగ ప్లాన్ చేస్తుంది. ప్రమీల బాధపడుతుంటే రుద్ర, గంగ ఆమెను కూడా వేడుకలో భాగం చేస్తారు. అందరి మగవాళ్లు తమ భార్యలకు గోరింటాకు పెడతారు. అయితే ఈ వేడుకలో ఇషిక పెద్ద కుట్ర చేస్తుంది. గంగ గోరింటాకులో కెమికల్ కలుపుతుంది. దానివల్ల గంగ చేతులకు ఇరిటేషన్ రావాలని ప్లాన్ వేస్తుంది. కానీ ప్లాన్ రివర్స్ అయి ఇషికకే ఇరిటేషన్ వస్తుంది. రంగా ఆ కెమికల్ కలిపిన వీడియోని తీసి చూపించడంతో ఇషిక దొరికిపోయి సారీ చెప్తుంది.
వేడుకలో అందరి గోరింటాకు బాగా పండుతుంది, కానీ జయ గోరింటాకు మాత్రం పండదు. ఈ వేడుకకు కారణం గంగ అని సుధా మెచ్చుకుంటుంది. మరోవైపు ఇషిక గోరింటాకు కడుక్కోవడంతో సూర్య కోప్పడతాడు. తరువాయి భాగంలో అసలు ట్విస్ట్ మొదలవుతుంది. బయట పడి ఉన్న పెద్ద కర్ర, స్టోర్ రూమ్ లో ఉన్న తాడు, చెప్పులను చూసి రుద్రకు అనుమానం వస్తుంది. ఇంటికి ఎవరో వచ్చారని చెప్పి సీసీటీవీ ఫుటేజ్ చూడాలని గంగ అంటుంది. రుద్ర సీసీటీవీ చూస్తుంటే వీరు టెన్షన్ పడతాడు. వీరు రామనాథాన్ని బంధించిన నిజం సీసీటీవీతో బయటపడుతుందా? జయ పెళ్లి ప్లాన్ ఏమవుతుందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |